24, అక్టోబర్ 2014, శుక్రవారం

మహిళ

భర్త మాట కోసం అమ్ముడు పోయిన సత్య యుగపు స్త్రీ
శీల పరిక్షకోసం అగ్నిలో దూకిన త్రేతాయుగపు సీత
భర్త జూదానికి దాసిగా మారిన ద్రౌపది కథ
పతి సుఖం కోసం సాని కాలి మొక్కిన సతీసతులు
ఆహా! నా పుణ్య భూమిలో మహిళ ఘన కీర్తి ఎంతో కదా!
ఇద్దరు భార్యలున్న దేవుళ్ళకు నిలువెత్తున  మ్రొక్కె మనకు
ఇద్దరు భర్తలు అన్న పదమే కర్ణ కఠోరమెందుకో
పుట్టుకుతో అమ్మాయా...? అనే ఇసడింపుని దాటి
అమ్మాయే కుటుంబానికి అధరవు అనే స్థాయికి ఎదిగి
పెళ్లి తో ఇంటి పేరుని
కనడంతో ఒంటి తీరుని
పెంచడం లో కంటి నిద్రను
సంసారంలో సర్వం త్యాగం చేసే
ఓ స్త్రీమూర్తి నీ త్యాగం నిరూపమానమ్
నీ సహన శక్తీ అధ్బుతీయం
వంటింటి కుందేలు స్థాయి నుండి
ఆకాశ మార్గాన అంతరిక్ష యానం వరకు
అందమైన కుటుంబ బాద్యతనుండి
అంతర్జాతీయ వ్యాపార అధిపతులుగా
తల్లి చాటు బిడ్డలా స్థాయి నుండి
దేశాన్ని నడిపే నాయికలుగా
మీరు ఎదిగిన తీరు వర్ణనాతీతం
అవరోధాల చిక్కులు దాటి
అవకాశాల దారిన మీ ప్రయాణం...ఇంకా ముందుకు సాగాలని
సమాన హక్కుల పోరాటంతో....సమున్నత స్తాయికి చేరాలని
మనసార ఆకాంక్షిస్తూ....మహిళా నీకు శుబాభినందనం.
                                                                           అనిల్ కొమ్మినేని

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి