31, డిసెంబర్ 2022, శనివారం

Happy Nea Year 2023

కాల చక్రపు కాంతి వేగంలో  
మరోవత్సరం ముగిసింది
ఇంకో సంవత్సరం సాదర స్వాగతం పలుకుతుంది  
నూతన వత్సర తొలి ఉషోదయ కాంతిలో  
ముగిసిన సంవత్సర మలి అస్తమయ చీకటిలో  
గడచిన కాలాన్ని నెమరవేసుకుంటే

నీకు కనిపిస్తున్న గతం ఏమిటి
నీకు వినిపిస్తున్న గళం ఎవరిది
నీవు నడిచొచ్చిన బాట ఆణవాల్లేమిటి  
నీకు నీవు మిగుల్చుకున్న జ్ణాపకాలేమిటి
అందంగా నీ మదిలో దాగిన మధురానుభుతులేమిటి   
నీకు నువ్వుగా అర్ధమయ్యే నీ వాస్తవికత ఏమిటి  

ముగిసిన వత్సరానికి వీడ్కోలు చెప్పువేళ   
ఆ సమయం పాఠంగా మిగిల్చిన అనుభవ సారంతో
నిన్ను నువ్వు నిత్యనూతనంగా మలుచుకుంటూ
ఆశల భవిష్యత్తుకు బాటలు వేస్తూ
మన జీవణ పయనంలో మరో సంవత్సరానికి సాదర ఆహ్వాణం పలుకుదాం  

ఈ వత్సర పయణం మధురంగా సాగాలని
ఆనందాన్ని ఆరోగ్యాన్ని నింపే బాటగా మిగలాలని
మనస్ఫూర్తిగా  కోరుకుంటూ
హ్రుదయ పూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు  
                                            ........@నిల్