31, డిసెంబర్ 2013, మంగళవారం

జీవితం

జీవితమంటే ఓ ఆరాటం
జీవితమంటే ఓ పొరాటం
ఈ జీవన పయనం అనంతం
తీరం తెలియక
గమ్యం వెతుకుతూ
సాగిపొయే ఓ అంతులేని ప్రయాణం....
ఎవరు ఎందుకు పరిచయం అవుతరో....
అంతలోనే ఎందుకు కనుమరుగవుతారో....
ఎప్పుడు దేనికి కొందరితొ విడిపొతారో...
మరెందుకు ఇంకొందరికి ఆత్మీయులవుతారొ....
కష్టం సుఖం, బాద నవ్వు, ఆత్మీయత ద్వేషం
ఇలా భిన్న ధ్రువాల సమాహారమై
మనిషిని ముందుకె నడిపే ఈ జీవితం ఓ అధ్బుతం
అమాయకత్వం ఆనందం కలబోసిన బాల్యం
కొండలని పిండి చేయగల ధైర్యాన్ని ఇచ్చు యవ్వనం
భాద్యతలు భుజాన మోసే మధ్యమం  
అలసిపొయి అవశాన దశకు చేరి
అపార అనుభవాన్ని పంచు వ్రుద్దాప్యం
అన్ని దశలలోను  అలుపెరుగని పొరాటమే కదా
ఆశల ఆలంబనలొ సాగే
ఈ జీవన పరుగు పందం లో
ఏమి కొల్పుతున్నమో తెలిసెలొపే
జీవితపు అంచుకు చేరుకుంటున్నాం
అంతే లేని ఈ ప్రయాణన్ని ప్రశ్నార్ధకం చేయడం కన్నా..
సాధ్యమైనంత ఆనందం గా గడప గలగడమే
జీవన  పరమార్ధమెమో.......

Happy New Year - 2014


కాల చక్రపు వాయు వేగం లో
మరో వత్సరం ముగిసింది
ఆ సంవత్సరపు మలి సంధ్యలో
మనస్సును తట్టి లేపుతుంటే
గడిచిన కాలపు గాయలెన్నో
అది నేర్పిన పాఠాలెన్నో
మనస్సుని తాకిన మధుర స్ముతులెన్నొ
గత కాలపు అనుభవల పాఠాల మీద
వర్తమానపు నడక సాగుతుంటే నే
భవిష్యత్తు కి భరొసనివ్వగలం కదా...
మరలా తిరిగిరాని 2013 కి సాదర వీడ్కొలూ పలుకుతూ...
కొంగ్రొత్త ఆశలతో 2014 కి ఆత్మీయ స్వాగతం పలుకుతూ
హ్రుదయ పూర్వక నూతన సంవత్సర శుభకాంక్షలతో........అనిల్ కొమ్మినేని 

28, నవంబర్ 2013, గురువారం

ప్రేమంటే

భాషకు, భావనకు అందని
ఓ అందమైన బావుకతే ప్రేమ కదా....

పొత్తిళ్లలొ పురిటి బిడ్డ తలపై
అమ్మ చేతి చల్లని స్పర్శ
ఎంతటి అనురాగ ఆర్తియో కదా...

బిడ్డ ప్రతి అడుగకు ఆధారమవుతూ
తన కష్టమంతా ఆ పిల్లల నవ్వులొ తీర్చుకునే
నాన్న ప్రేమ నిష్కల్మష త్యాగ నిరతి కదా...

అన్నదమ్ముల అక్కచెల్లల్ల
అనురాగ బాంధవ్యం,
ఎన్నెన్ని జన్మల రాగ బంధమో కదా...

నిస్వార్ధ చింతనతొ, అద్వైత ధ్యానంలొ
 చేసే ఆ దైవసేవయంత
ఓ అముల్యమైన ప్రేమైక భావనే కదా...

కష్టాల కడలి కనుచూపు చేరెలోపు
వెన్నుతట్టి వెలెకట్టలేని ధైర్యాన్ని పంచే
 ప్రాణ స్నేహితుణి పవిత్ర మనస్సు ఓ ప్రేమాలయం కదా...

నూనూగు మీసాల నవయవ్వన దశలొ
చెలి వలపు తలపుల కలల లోకంలో కక్ష్యా విహంగం చెసే
ఆ యువకుని ప్రేమప్రపంచం మధురాతి మధురం కదా...

చిలిపి వయసు వెచ్చని కవ్వింతలు
కన్నె మదిని మాయ చేస్తూంటే
ప్రియుని పలకరింపు కోసం పరిపరి విదాల తపించు
ఆ పడతి హ్రుదయం ఓ ప్రేమ ప్రపంచం కదా...

తనువు, తలపు
మోహం, విరహం
కష్టం, సుఖం
సరసం, విరసం
అలక, ఆత్మీయత
కలగలిపిన వివాహభందం
ఓ ప్రేమ బందిఖానా కదా...

కన్న బంధపు బాధ్యత భుజనికెత్తుకొని
తల్లితంద్రుల సేవలొ పునీతమయ్యె
బిడ్డలెంతటి ధన్యజీవులో కదా..

కులం, గోత్రం
జాతి, మతం
దేశం, విదేశం
అంటూ భేదంలేకుండాఅందరినీ అత్మీయం గా
అక్కున చేర్చుకున్నమథర్ థెరిస్సా
ఈ మానవాలికి ఆదర్శ మూర్తి అయితే

విశ్వమంతా ఓ నిర్మల ప్రేమాలయం కాదా ...
మానవజీవితం ఆ స్వర్గసీమకు సరి సాటి అవ్వదా..
                                                   ప్రేమైక ప్రపంచం కోసం......అనిల్ కొమ్మినేని