5, సెప్టెంబర్ 2011, సోమవారం


కసురుకునే నీ వైనం ఉసురు తీస్తున్నా
విసుగు రాని నా మనసే ఎదురుచూస్తోంది
ముసురుకునే నా మరణం నను మసి చేస్తున్నా
తీరిపోని నా ఆశే మరుజన్మనిస్తోంది
నవ్వు నటిస్తున్నా నమ్మలేమంటున్నారు
కంటిలో నలకని సర్ది చెప్పినా వంకలు చెప్తున్నానంటున్నారు
బహుశా సంద్రాన్ని తలపించే కన్నీటిని ఇముడ్చుకునేందుకు నా దేహవైశాల్యం సరిపోలేదేమో
నిద్రిస్తున్నా కాని చెక్కిలిపై కన్నీటి రేఖలు ముద్రిస్తూనే ఉంది ఈ ప్రేమ..................Madhumathi


ఉసురు తీస్తున్న వైనం కరుకుగా మారాలి
ఎదురు చూస్తున్న మనసే కసిగా రగలాలి
మరణ వేదనే మసిగా మారాలి
నీ మనస్సులోని ధ్రుడ సంకల్పం..వజ్రాయుధ కాఠిణ్యాన్ని రగల్చాలి
వూందో లేదొ తెలియని మరుజన్మ భ్రమని వదిలి
మరు నిమషం కోసం మడం తిప్పక నిలబడాలి
నీ అశల అమాయకత్వాన్ని...అందమైన భవిష్యత్తుపై
నమ్మకాన్ని కలిగించె మార్పుకు సిద్దం చేయాలి
ప్రేమ అనే నమ్మకపు నీలి నీడలు
నా కఠిన్యపు కోరలులో కనుమరుగవ్వాలి
మీమాంసపు నమ్మకాన్ని వదిలి
ఆత్మవిశ్వాసపు అందలాన్ని ఎక్కాలి
సర్దుకు పోయే బానిస తత్వాన్ని వదిలి
ప్రశ్నించ గలిగే పొగరు రావలి
నీ కన్నిటిని సంద్రంగా మార్చటం కంటే
ఆ కన్నీటి సందంపై నియంత్రణ సాధించి
ఆకాశమంత అవకాశాల సంద్రంపై స్వారికోసం సిద్దం కా
కన్నీటి మయమైన నీ చెక్కిలిపై
కాఠిన్యంతో రగిలి జ్వలించి
విజయం సాధించిన చిరు దరహసాన్ని మిగుల్చు...........Anil