28, నవంబర్ 2013, గురువారం

ప్రేమంటే

భాషకు, భావనకు అందని
ఓ అందమైన బావుకతే ప్రేమ కదా....

పొత్తిళ్లలొ పురిటి బిడ్డ తలపై
అమ్మ చేతి చల్లని స్పర్శ
ఎంతటి అనురాగ ఆర్తియో కదా...

బిడ్డ ప్రతి అడుగకు ఆధారమవుతూ
తన కష్టమంతా ఆ పిల్లల నవ్వులొ తీర్చుకునే
నాన్న ప్రేమ నిష్కల్మష త్యాగ నిరతి కదా...

అన్నదమ్ముల అక్కచెల్లల్ల
అనురాగ బాంధవ్యం,
ఎన్నెన్ని జన్మల రాగ బంధమో కదా...

నిస్వార్ధ చింతనతొ, అద్వైత ధ్యానంలొ
 చేసే ఆ దైవసేవయంత
ఓ అముల్యమైన ప్రేమైక భావనే కదా...

కష్టాల కడలి కనుచూపు చేరెలోపు
వెన్నుతట్టి వెలెకట్టలేని ధైర్యాన్ని పంచే
 ప్రాణ స్నేహితుణి పవిత్ర మనస్సు ఓ ప్రేమాలయం కదా...

నూనూగు మీసాల నవయవ్వన దశలొ
చెలి వలపు తలపుల కలల లోకంలో కక్ష్యా విహంగం చెసే
ఆ యువకుని ప్రేమప్రపంచం మధురాతి మధురం కదా...

చిలిపి వయసు వెచ్చని కవ్వింతలు
కన్నె మదిని మాయ చేస్తూంటే
ప్రియుని పలకరింపు కోసం పరిపరి విదాల తపించు
ఆ పడతి హ్రుదయం ఓ ప్రేమ ప్రపంచం కదా...

తనువు, తలపు
మోహం, విరహం
కష్టం, సుఖం
సరసం, విరసం
అలక, ఆత్మీయత
కలగలిపిన వివాహభందం
ఓ ప్రేమ బందిఖానా కదా...

కన్న బంధపు బాధ్యత భుజనికెత్తుకొని
తల్లితంద్రుల సేవలొ పునీతమయ్యె
బిడ్డలెంతటి ధన్యజీవులో కదా..

కులం, గోత్రం
జాతి, మతం
దేశం, విదేశం
అంటూ భేదంలేకుండాఅందరినీ అత్మీయం గా
అక్కున చేర్చుకున్నమథర్ థెరిస్సా
ఈ మానవాలికి ఆదర్శ మూర్తి అయితే

విశ్వమంతా ఓ నిర్మల ప్రేమాలయం కాదా ...
మానవజీవితం ఆ స్వర్గసీమకు సరి సాటి అవ్వదా..
                                                   ప్రేమైక ప్రపంచం కోసం......అనిల్ కొమ్మినేని