24, అక్టోబర్ 2014, శుక్రవారం

మహిళ

భర్త మాట కోసం అమ్ముడు పోయిన సత్య యుగపు స్త్రీ
శీల పరిక్షకోసం అగ్నిలో దూకిన త్రేతాయుగపు సీత
భర్త జూదానికి దాసిగా మారిన ద్రౌపది కథ
పతి సుఖం కోసం సాని కాలి మొక్కిన సతీసతులు
ఆహా! నా పుణ్య భూమిలో మహిళ ఘన కీర్తి ఎంతో కదా!
ఇద్దరు భార్యలున్న దేవుళ్ళకు నిలువెత్తున  మ్రొక్కె మనకు
ఇద్దరు భర్తలు అన్న పదమే కర్ణ కఠోరమెందుకో
పుట్టుకుతో అమ్మాయా...? అనే ఇసడింపుని దాటి
అమ్మాయే కుటుంబానికి అధరవు అనే స్థాయికి ఎదిగి
పెళ్లి తో ఇంటి పేరుని
కనడంతో ఒంటి తీరుని
పెంచడం లో కంటి నిద్రను
సంసారంలో సర్వం త్యాగం చేసే
ఓ స్త్రీమూర్తి నీ త్యాగం నిరూపమానమ్
నీ సహన శక్తీ అధ్బుతీయం
వంటింటి కుందేలు స్థాయి నుండి
ఆకాశ మార్గాన అంతరిక్ష యానం వరకు
అందమైన కుటుంబ బాద్యతనుండి
అంతర్జాతీయ వ్యాపార అధిపతులుగా
తల్లి చాటు బిడ్డలా స్థాయి నుండి
దేశాన్ని నడిపే నాయికలుగా
మీరు ఎదిగిన తీరు వర్ణనాతీతం
అవరోధాల చిక్కులు దాటి
అవకాశాల దారిన మీ ప్రయాణం...ఇంకా ముందుకు సాగాలని
సమాన హక్కుల పోరాటంతో....సమున్నత స్తాయికి చేరాలని
మనసార ఆకాంక్షిస్తూ....మహిళా నీకు శుబాభినందనం.
                                                                           అనిల్ కొమ్మినేని

బాల్యం

ఓ మధుర జ్ఞాపకం...ఓ మనసు పుస్తకం
నిత్యం చెరగని చిరునవ్వులనందిచే...
ఎన్నటికి తరగని జ్ఞాపకాల ఆస్తి
తెల్ల చొక్కా ఎర్ర లాగులో...బడికి నడిచిన కాలంలో
వందేమాతరం  దగ్గర మొదలయ్యి...
జనగణమన తో ముగిసే రోజులలో
ఆ రెండిటి మధ్య
పదిలంగా మనసు లోగిలిలో ఒదిగిన మధుర క్షణాలెన్నో
పాస్ బెల్ కొట్ట్టగానే పిచ్చి బంతి
అన్నం గంట కొట్టగానే..పరుగెత్తికెల్లి
పుస్తకాల సంచి ఇంట్లో పడేసి
గోలిల ఆట కోసం చెరువు గట్టుకెల్లె రోజులు
కోతి కొమ్మచ్చి, కర్ర బిళ్ళ, బచ్చాలాట
నిత్యక్రుత్యమైన బాల్యం
ఆటలలో పడి ఇంటిని మరిస్తే
అల్లంత దురాన వెతుక్కుంటూ వస్తున్నా నాన కనపడగానే
దొడ్డి దారిన ఆయనకంటే ముందే
ఇంటికి చేరి అమ్మ చాటున దక్కునే క్షణాలు
విమాన శబ్దం వినపడగానే...ఇంటి ముందుకి పరిగెత్తి
ఆకాశానికి టాటా చెప్పిన రోజులు
ఉరులోకి కారు రాగానే...దాని వెనక రేగే దుమ్ములో పరిగెడుతూ
దానిని చూడడం లో వుండే సంతోషం
ఎర్ర బస్సు ఊరిలో వెళ్తుంటే ఎగురుకుంటూ చేతులు ఊపడం ఎంత ఆనందమో
తలచుకుంటే మదిలో మెదిలే ఆ సుందర దృశ్యాలు
జ్ఞాపకాల దొంతరల్లో నన్ను చూపిస్తూ...నాకు ఏది నిజమైన ఆనందమో తేల్చి చెప్పే సత్యాలు
అయిన ఆగదు ఈ కృత్రిమ జీవన పయనం..బాద్యతల బరువుతో..సంతోషంకన్నా..సంపాదనే జీవనం లా...

                                                                                                               అనిల్ కొమ్మినేని

25, మార్చి 2014, మంగళవారం

రాజకీయం

రాజకీయం రాజకీయం
రంగులు మారుస్తూ రంకెలు వేస్తూ
నిర్లజ్జగా రంకు చేసే రాజకీయం....  
రాచరికం పోయి రాజ్యాగం వచ్చి
రాజకీయం చెయ్యమంది
ప్రజలను ప్రభువలను చెయ్యడానికి
ప్రజా ప్రతినిధిని ప్రజల సేవకూడిగా మార్చటానికి
కులం పేరుతొ , మతం పేరుతో, ప్రాంతం పేరుతో
ప్రజల మధ్య చిచ్చు లేపుతూ
స్వార్ధమే పరమావధిగా
అవనీతే ఆలంభనగా
అధికారమే దోపిడికి రాజమార్గం గా  
దొంగల గుంపుగా మారింది మన రాజకీయం
నాయకుడి మొదటి అర్హత రౌడియిజం
మలి అర్హత ధనవంతుడవటం అయినప్పుడే
రాజకీయానికి రంకు అని అర్ధం మారిందేమో  
ఎవడబ్బ సొమ్ము కడతావ్ ఉచిత విద్యుత్తు కి
ఎక్కడ దోపిడీ చేసి పెడతావ్ కార్పోరేట్ కాలేజి ఫీజులుకి
ప్రజా సొమ్ముని ఉచితం అని పావు పంచుతూ ముప్పావు మింగుతూ
రాష్త్రాన్ని దేశాన్ని అప్పుల ఊభిలొ నెట్టీ
భవిష్యత్తుకి భద్రతనివ్వని ఈ క్షుద్ర రాజకీయం ఇంక ఎన్నినాల్లో ....
దేశ గమనాన్ని నిర్దేశిస్తూ
యువత భవితకు భరొసానిస్తూ
బాలల బంగారు భవిష్యత్తుకి బాటలు పరుస్తూ
అన్నార్తుల ఆకలి తీరుస్తూ
అవినీతిని తరిమిగొట్టి
భాగ్య భారతాన్ని ఆవిష్కరించే పవిత్ర రాజకీయం ఎప్పుడో....      

17, ఫిబ్రవరి 2014, సోమవారం

యువతా మేలుకో..

యువతా మేలుకో...నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....
నవయవ్వన ప్రాయం లో....
యువ రక్తపు ఉరకలలో...
ఆ నింగీ నేల నీకే సొంతం
సంద్రపు అలల్లా ఎగిసిపడే ఉత్సాహంతో
కొండలను పిండి చేయగల ఆత్మ విశ్వాసంతో
అనితర సాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగల ధైర్యంతో
నీవు వేసే ప్రతి అడుగు..
నీ బంగారు భవితకు శ్రీకారం కావలి...

యువతా మేలుకో....నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....
ప్రియురాలి ప్రేమ మైకంలో మునిగి తేలినా
ప్రియుడి ప్రేమకోసం పరితపించిన
స్నేహం కోసం ప్రాణం పణంగా పెట్టినా
సినిమా కోసం చదువుని వదిలినా
ఆ అందమైన వయస్సులో అంతర్భాగమే...
మరలా తిరిగిరాని మధుర స్మ్రుతులే..
అయితే ప్రేమ మైకం లో చదువుని నిర్లష్యం చేస్తే
సినిమా మైకం లో కర్తవ్యాన్ని విస్మరిస్తే
సరదా తిరుగల్లలొ భవిష్యత్తుని భస్మం చేసుకుంటే
వచ్చే నీ దుర్భర భావి జీవితానికి నీవే కారకుడివి
వయసు సరదాలని ఆనందిస్తూనే
విస్ప్రష్ట ప్రణాళికతో భవిష్యత్తుకి బాటలు పరుచుకో...
కాలయాపన వదిలి కార్యోన్ముఖుడివి కా....
దూసుకెల్తున్న ఈ పోటి ప్రపంచం లో
నిరంతర శ్రామికుడివై...నీ స్థానాన్ని నిర్దేశించుకో....

యువతా మేలుకో....నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....