18, జూన్ 2017, ఆదివారం

అక్షరం


అమ్మ ఒడిలో దిద్దిన అక్షరం
నాన్న నడిపిస్తు నేర్పిన అక్షరం
గురువు అణువణువు నింపిన అక్షరం

అనుక్షణం నీ చెంత ఉండగా

నీకు అందలేని శిఖరమేది
నీవు చేరలేని ద్వీపమేది
నీవు వ్రాయలేని కావ్యమేది
నీవు చెప్పలేని వేదాంతమేది  

అక్షరమే ఓ అద్భుతం కదా ..

అక్షరాణ్ణే ఆయుధంగా మలిచి సమాజన్ని జాగ్రుతం చేసిన కవులెందరో
అక్షరాణ్నే అస్త్రం గా ప్రయోగించి స్వచ్చ పాలనకు బాటలు వేసిన పాత్రికేయులెందరో
అక్షరాణ్ణే శక్తితో నింపి ఎందరో యువకుల విజయానికి ప్రేరణనిచ్చిన పుస్తకాలెన్నొ
అక్షరాణ్ణే ఆత్మీయ వారధిగా నిలుపుతు నాన్న వ్రాసిన ఉత్తరాలెన్నో
అక్షరాణ్ణే అందమైన భావనగా చెలి చెంతకు చేర్చిన ప్రేమలేఖలెన్నొ        


అక్షరమా నీవో అద్భుతం....                   ....అనిల్ కొమ్మినేని

21, మే 2017, ఆదివారం

చిరునవ్వు

పాల బుగ్గల పసిపాప చిరు పెదవుల వికసింపులో
ఎంతటి తెలియని ఆకర్షణొ.....
కర్మగార కార్యాలయాల్లో
రోజంతా అలసి సొలసి ఇంటికి చేరిన తల్లిదండ్రులకు
ఆనంద హర్షాతిరేకాలతొ చిరునవ్వుల పిల్లల స్వాగతం
అలసటను మటుమాయం చేయగల అమ్రుత గులికయే కదా......
నవయవ్వన ప్రణయ ప్రవాహంలో
విల్లులా విచ్చుకునే అధరాల చిరు దరహాసం
ఎంతటి రసరమ్య సమ్మొహన శక్తియో కదా...
నటనతో మూతి ముడుచుకుంటుంటే
నవ్వుతో కొంటె కళ్ళు కవ్విస్తుంటే
ఆ స్థితిని అర్ధం చేసుకోలేని అమాయకపు భర్త
అయొమయమూ అపురూప ద్రుశ్యమే కదా.......
ప్రయాణపు బడలికలో
అపరిచితుల చిరు మందహాసం
పరిచితంగా మారి ఆ ప్రయాణపు నేస్తంగా మారడం
మరపురాని అనుభుతియే కదా
వ్రుద్ధాప్యపు ముడతలలొ బాల్యపు మాటలు దరిచేరి
పెదవులను స్వచ్చమైన నవ్వుతో విడదీయ గలిగితే
అందరూ ఆ బొసినవ్వుల బాపులే కాలే రా...
చిరునవ్వు మనస్సుకి ఒక స్వాంతన
చిరునవ్వు మెదడుకి ఓ ఉత్ప్రేరణ
చిరునవ్వు మనుష్యులుని దగ్గర చేర్చు ఆకర్షణ శక్థి
చిరునవ్వు మనస్సులుని భందించే ఓ సమ్మొహన అస్త్రం
చిరునవ్వు భాదల చీకట్లను పారద్రొలు ఓ వెలుగు దివ్వే
అందుకే నవ్వండి నవ్వించండి నవ్వుతూ  ఉండండి
చిరునవ్వుతో....ఆనిల్