27, మే 2011, శుక్రవారం

ఏది ప్రేమ....ఏది మిధ్య....


ఏది ప్రేమ....ఏది మిధ్య....

ప్రేమ ఓ ప్రేమా......
కన్న ప్రేమ యా..., అన్న ప్రేమయా...,
ఆలి ప్రేమయా..., ఆరధించె దైవ ప్రేమయా....

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....

లేక అన్నింటికి మించి....
కామ ఖేళిలో.....కౌగిలి లాలనలొ....
యవ్వనపు హద్దులు చెరిపిన.....
ప్రియురాలి ప్రేమయా...

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....

కన్న ప్రేమకు మించిన బంధమే లేదన్నారు ....కొందరు
ప్రియురాలి కోసం ప్రాణార్పనకు సిద్దమయ్యె...ప్రేమికుల ప్రేమ అమరమన్నారు...
కష్ట నష్టాలెన్ని వున్నా మునిపంటితొ మూడుముళ్ళ క్రింద నొక్కి..
సహజీవనం సాగించే ఆలి ప్రేమయే అజరామరం అని అన్నారు...
దైవ చింతన తప్ప దేహ చింతనే వద్దు ...
సర్వం సర్వస్వం ఆ పాద చెంతకే అంటూ...జీవితమే మొక్ష ప్రధానమన్నారు...

మరి ఏది ప్రేమ....ఏది మిధ్య.....

ప్రేమ అనేదే ఓ మిధ్య.. ప్రేమించాను అన్న భావనే ఓ మిధ్య..

బంధ బంధానికి, స్వార్ధ చింతనకి, శరీర అవసరాలకి, మొక్ష ప్రయోజనలకీ ....
తాకట్టు ఈ ప్రేమ....ప్రేమే ఓ మిధ్య.. ప్రేమించాను అన్న భావనే ఓ మిధ్య..


ప్రేమ ఓ ప్రేమా......
కన్న ప్రేమ యా..., అన్న ప్రేమయా...,
ఆలి ప్రేమయా..., ఆరధించె దైవ ప్రేమయా....
లేక ప్రియురాలి ప్రేమయా...

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....


మీ ఆనిల్ .....

జ్ఞాపకాలు


జ్ఞాపకాలు

సంధ్యా కాలపు సుర్యుడి వెలుగులో........
సంధ్రపు ఒడిన సేదతీరుతున్న వేళ
ఎగిసి వస్తున్న కెరటాల సవ్వడి.......
కాలచక్రంలో కలిపొయిన వాస్తవాలని జ్ఞప్తికి తెస్తుంటే
ఆ మధుర స్మ్రుతుల తీయదాననికి పెదవులు దరహాసం చెస్తున్నా.........
మధి మాత్రం ఆ అనుభుతుల స్మరణలో........
భారంగా మారి ఎందుకు భాదిస్తుంది????
గత కాలపు సుందర అనుభవాలు కూడ.......
సంద్రపు అలలలో చేరి ఎందుకు కల్లొల పరుస్తాయో..
గదిచిన మధుర చేదు క్షణాలన్ని........
భవిష్యత్తు లో భాదనే ఎందుకు మిగులుస్తాయో....

Prema


సాంకేతిక విద్యా సన్నహాక వత్తిడిని
కులాసాగా సాగుతున్న కళాశాల జీవితం మరిపిస్తున్న సమయం
నూనుగు మీసాల నవ యవ్వనపు రోజులులో
శారిరక మార్పులు సహచరికోసం తపిస్తుంటే
ఆకర్షణకి, అభిమానానికి తేడ తెలియని వయసు
ఆ మానసిక స్థితినే ప్రేమాన్వెషణగా భ్రమింప జేస్తుంటే
నవ యవ్వనపు సుందరి కోసం
నాజుకు అమ్మయిల నడుము ఒంపు కోసం
నయనాల వెతుకులాట.........
ఆ ఆరటం లో ఆకలిగా ఎదురు చూస్తున్న రోజులు
ఓ నులివెచ్చని సూర్యొదయ సమయం లో
ఆ అరుణ కిరణ వర్ణపు మేని ఛాయలో మెరుస్తూ
వాయుదేవుని అండతో వేరుపడిన కురులు అలరిస్తుండగా
కలువ రేకుల్లాంటి ఆమె కనులు కవ్విస్తుంటే
గులాబి రంగు పెదవులు చిరు దరహాసం చేస్తుండగా
ముత్యపు పళువరుస మనస్సుని ఎందుకో తొందరపెడుతుంది
ఆ శంఖపు మెడ స్పర్శ కోసం చేతులు తపిస్తుండగా...
కనులు మాత్రం మెడ క్రిందకు మరలుతుంటే
మనస్సు ఎందుకో అది భావ్యం కాదని హెచ్చరిస్తుంది..
ఇంతటి వర్ణన తరువాత.....
నాలో జరిగింది శారీరక కోరిక లేక మానసిక ప్రేమా...
నాకే తెలియని అయోమయం
మెదడు మాత్రం ప్రేమ అంటేనే ఫలితం అని హెచ్చరిస్తుంది
శరీరం మాత్రం అగ్నిలా రగిలి పోతుంది
ఆ సమయం లో అది కోరిక అని చెబితే...నాకు చెంప దెబ్బ
ప్రెమ అని చెబితె సమయం కావలి అంటు చిరు దరహాసం
అలా ఆ భౌతిక ఆకర్షణ ప్రేమగా మారిన వయనం
ఆ ప్రెమ దిన దిన సంఘర్షణగా....
ఆ సంఘర్షణ లో అలకలు, కోపాలు, తాపాలు
ఆఖరి క్షణానికి దగ్గరవుతున్న కొద్ది
మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతున్న వయనం..
విడిపోవడానికి వేలకారాణాలతో...
మరో జీవితానికి సిద్దమవుతున్న క్షణాలు...  

To be continued,
Anil