27, మే 2011, శుక్రవారం

ఏది ప్రేమ....ఏది మిధ్య....


ఏది ప్రేమ....ఏది మిధ్య....

ప్రేమ ఓ ప్రేమా......
కన్న ప్రేమ యా..., అన్న ప్రేమయా...,
ఆలి ప్రేమయా..., ఆరధించె దైవ ప్రేమయా....

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....

లేక అన్నింటికి మించి....
కామ ఖేళిలో.....కౌగిలి లాలనలొ....
యవ్వనపు హద్దులు చెరిపిన.....
ప్రియురాలి ప్రేమయా...

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....

కన్న ప్రేమకు మించిన బంధమే లేదన్నారు ....కొందరు
ప్రియురాలి కోసం ప్రాణార్పనకు సిద్దమయ్యె...ప్రేమికుల ప్రేమ అమరమన్నారు...
కష్ట నష్టాలెన్ని వున్నా మునిపంటితొ మూడుముళ్ళ క్రింద నొక్కి..
సహజీవనం సాగించే ఆలి ప్రేమయే అజరామరం అని అన్నారు...
దైవ చింతన తప్ప దేహ చింతనే వద్దు ...
సర్వం సర్వస్వం ఆ పాద చెంతకే అంటూ...జీవితమే మొక్ష ప్రధానమన్నారు...

మరి ఏది ప్రేమ....ఏది మిధ్య.....

ప్రేమ అనేదే ఓ మిధ్య.. ప్రేమించాను అన్న భావనే ఓ మిధ్య..

బంధ బంధానికి, స్వార్ధ చింతనకి, శరీర అవసరాలకి, మొక్ష ప్రయోజనలకీ ....
తాకట్టు ఈ ప్రేమ....ప్రేమే ఓ మిధ్య.. ప్రేమించాను అన్న భావనే ఓ మిధ్య..


ప్రేమ ఓ ప్రేమా......
కన్న ప్రేమ యా..., అన్న ప్రేమయా...,
ఆలి ప్రేమయా..., ఆరధించె దైవ ప్రేమయా....
లేక ప్రియురాలి ప్రేమయా...

ప్రేమ ఓ ప్రేమా......
ఏది ప్రేమ....ఏది మిధ్య.....


మీ ఆనిల్ .....

1 కామెంట్‌:

  1. మొత్తం అన్నీ చెప్పి చివరికి ఏదీ చెప్పకపోతే అలా అనిల్ గారూ? సరే నాకు తెలిసినంతవరకూ ప్రేమకు లింగ, వయో, వరుసల భేదాలు లేవు. మనస్ఫూర్తిగా ఎవరిని ప్రేమించినా అది గొప్ప ప్రేమే అది అజరామరమే!

    రిప్లయితొలగించండి