25, మార్చి 2014, మంగళవారం

రాజకీయం

రాజకీయం రాజకీయం
రంగులు మారుస్తూ రంకెలు వేస్తూ
నిర్లజ్జగా రంకు చేసే రాజకీయం....  
రాచరికం పోయి రాజ్యాగం వచ్చి
రాజకీయం చెయ్యమంది
ప్రజలను ప్రభువలను చెయ్యడానికి
ప్రజా ప్రతినిధిని ప్రజల సేవకూడిగా మార్చటానికి
కులం పేరుతొ , మతం పేరుతో, ప్రాంతం పేరుతో
ప్రజల మధ్య చిచ్చు లేపుతూ
స్వార్ధమే పరమావధిగా
అవనీతే ఆలంభనగా
అధికారమే దోపిడికి రాజమార్గం గా  
దొంగల గుంపుగా మారింది మన రాజకీయం
నాయకుడి మొదటి అర్హత రౌడియిజం
మలి అర్హత ధనవంతుడవటం అయినప్పుడే
రాజకీయానికి రంకు అని అర్ధం మారిందేమో  
ఎవడబ్బ సొమ్ము కడతావ్ ఉచిత విద్యుత్తు కి
ఎక్కడ దోపిడీ చేసి పెడతావ్ కార్పోరేట్ కాలేజి ఫీజులుకి
ప్రజా సొమ్ముని ఉచితం అని పావు పంచుతూ ముప్పావు మింగుతూ
రాష్త్రాన్ని దేశాన్ని అప్పుల ఊభిలొ నెట్టీ
భవిష్యత్తుకి భద్రతనివ్వని ఈ క్షుద్ర రాజకీయం ఇంక ఎన్నినాల్లో ....
దేశ గమనాన్ని నిర్దేశిస్తూ
యువత భవితకు భరొసానిస్తూ
బాలల బంగారు భవిష్యత్తుకి బాటలు పరుస్తూ
అన్నార్తుల ఆకలి తీరుస్తూ
అవినీతిని తరిమిగొట్టి
భాగ్య భారతాన్ని ఆవిష్కరించే పవిత్ర రాజకీయం ఎప్పుడో....