17, ఫిబ్రవరి 2014, సోమవారం

యువతా మేలుకో..

యువతా మేలుకో...నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....
నవయవ్వన ప్రాయం లో....
యువ రక్తపు ఉరకలలో...
ఆ నింగీ నేల నీకే సొంతం
సంద్రపు అలల్లా ఎగిసిపడే ఉత్సాహంతో
కొండలను పిండి చేయగల ఆత్మ విశ్వాసంతో
అనితర సాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగల ధైర్యంతో
నీవు వేసే ప్రతి అడుగు..
నీ బంగారు భవితకు శ్రీకారం కావలి...

యువతా మేలుకో....నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....
ప్రియురాలి ప్రేమ మైకంలో మునిగి తేలినా
ప్రియుడి ప్రేమకోసం పరితపించిన
స్నేహం కోసం ప్రాణం పణంగా పెట్టినా
సినిమా కోసం చదువుని వదిలినా
ఆ అందమైన వయస్సులో అంతర్భాగమే...
మరలా తిరిగిరాని మధుర స్మ్రుతులే..
అయితే ప్రేమ మైకం లో చదువుని నిర్లష్యం చేస్తే
సినిమా మైకం లో కర్తవ్యాన్ని విస్మరిస్తే
సరదా తిరుగల్లలొ భవిష్యత్తుని భస్మం చేసుకుంటే
వచ్చే నీ దుర్భర భావి జీవితానికి నీవే కారకుడివి
వయసు సరదాలని ఆనందిస్తూనే
విస్ప్రష్ట ప్రణాళికతో భవిష్యత్తుకి బాటలు పరుచుకో...
కాలయాపన వదిలి కార్యోన్ముఖుడివి కా....
దూసుకెల్తున్న ఈ పోటి ప్రపంచం లో
నిరంతర శ్రామికుడివై...నీ స్థానాన్ని నిర్దేశించుకో....

యువతా మేలుకో....నీ భవితను రాసుకో
భవిష్యత్తుని నిర్మించుకో....