20, అక్టోబర్ 2010, బుధవారం

మనసు ప్రయాణం.........

నా జీవిత ప్రయాణం ..........

    పచ్చని ఫైరూపంటలతో అలరారుతూ......ఆ చల్లని కృష్ణవేణి ప్రవహించే మార్గానికి రెండు కిలోమీటర్ల దూరంలో...... ఉరి పొలిమేరలోకి అడుగిడగానే తన జలాన్ని అందిస్తూ సుస్వాగతం పలికే పెద్దచెరువు....... ఆ పక్కనే దాహర్తినే తీర్చే చిన్న చెరువు...... ఆ చెరువుకు అటు పక్కగా చక్కని సరోవరం పక్కన పచ్చని వృక్ష సంపద.......... ఇటు చెరువు గట్టున అడుగుఅడులో తోడై నీ నడకకు నీడను అందించే మర్రి మానుల వరుస పరివారం........ప్రశాంత వదనంతో.....శాంత స్వభావం తో అక్కునే చేర్చుకునే ఆ మహాత్ముని విగ్రహం వురి ముందే కొలువై....మన మనస్సుల్ని ప్రశాంత చిత్తానికి లోను చేస్తూ ఊరి పెద్దగా ఆహ్వానించే.....ఆ కమనీయ గ్రామం దొండపాడు............

గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలం లోని ఒక అందమైన పల్ల్లెటురు .....మా దొండపాడు. ఆ ఊరిలో నివసించే కొమ్మినేని రామారావు, నాగ లక్ష్మి నా తల్లి దండ్రులు.  ఏ దేశమేగిన, ఎందు ఎత్తుకు ఎదిగిన......జన్మనిచ్చిన తల్ల్లిదండులను.... చదువు నేర్పిన గురువర్యులను....నీ తొలి అడుగికి పూనితమై నిన్ను అక్కున చేర్హుకున్న నీ కన్నా ఊరిని ఎన్నటికి మరవరాదు....

అలాంటి దైవసమానులయన నా కన్న తల్లిదండ్రులికి, గురువర్యులుకు, నాజన్మ భూమికి వినయ పూర్వక నమస్కారాలతో...........

మొదలుపెడుతున్నాను నా మనసు ప్రయాణం.........