27, మే 2011, శుక్రవారం

Prema


సాంకేతిక విద్యా సన్నహాక వత్తిడిని
కులాసాగా సాగుతున్న కళాశాల జీవితం మరిపిస్తున్న సమయం
నూనుగు మీసాల నవ యవ్వనపు రోజులులో
శారిరక మార్పులు సహచరికోసం తపిస్తుంటే
ఆకర్షణకి, అభిమానానికి తేడ తెలియని వయసు
ఆ మానసిక స్థితినే ప్రేమాన్వెషణగా భ్రమింప జేస్తుంటే
నవ యవ్వనపు సుందరి కోసం
నాజుకు అమ్మయిల నడుము ఒంపు కోసం
నయనాల వెతుకులాట.........
ఆ ఆరటం లో ఆకలిగా ఎదురు చూస్తున్న రోజులు
ఓ నులివెచ్చని సూర్యొదయ సమయం లో
ఆ అరుణ కిరణ వర్ణపు మేని ఛాయలో మెరుస్తూ
వాయుదేవుని అండతో వేరుపడిన కురులు అలరిస్తుండగా
కలువ రేకుల్లాంటి ఆమె కనులు కవ్విస్తుంటే
గులాబి రంగు పెదవులు చిరు దరహాసం చేస్తుండగా
ముత్యపు పళువరుస మనస్సుని ఎందుకో తొందరపెడుతుంది
ఆ శంఖపు మెడ స్పర్శ కోసం చేతులు తపిస్తుండగా...
కనులు మాత్రం మెడ క్రిందకు మరలుతుంటే
మనస్సు ఎందుకో అది భావ్యం కాదని హెచ్చరిస్తుంది..
ఇంతటి వర్ణన తరువాత.....
నాలో జరిగింది శారీరక కోరిక లేక మానసిక ప్రేమా...
నాకే తెలియని అయోమయం
మెదడు మాత్రం ప్రేమ అంటేనే ఫలితం అని హెచ్చరిస్తుంది
శరీరం మాత్రం అగ్నిలా రగిలి పోతుంది
ఆ సమయం లో అది కోరిక అని చెబితే...నాకు చెంప దెబ్బ
ప్రెమ అని చెబితె సమయం కావలి అంటు చిరు దరహాసం
అలా ఆ భౌతిక ఆకర్షణ ప్రేమగా మారిన వయనం
ఆ ప్రెమ దిన దిన సంఘర్షణగా....
ఆ సంఘర్షణ లో అలకలు, కోపాలు, తాపాలు
ఆఖరి క్షణానికి దగ్గరవుతున్న కొద్ది
మానసిక ఒత్తిడి ఎక్కువ అవుతున్న వయనం..
విడిపోవడానికి వేలకారాణాలతో...
మరో జీవితానికి సిద్దమవుతున్న క్షణాలు...  

To be continued,
Anil

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి